యూరోప్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు : డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దాదాపు పది వారాల తర్వాత మళ్లీ కేసుల సంఖ్య పెరిగినట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిజానికి ఇంకా అనేక యూరోప్ దేశాల్లో ట్రావెల్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. వైరస్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో పలు దేశాలు ఆంక్షలను పాటిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకుని ఈయూ డిజిటల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లు మాత్రమే యూరోప్ దేశాల్లో పర్యటించాలన్న నిబంధనను అమలులోకి తెచ్చారు.
యూరోప్ దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ తాజాగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. బ్రిటన్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు వెళ్తున్న వారికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. క్వారెంటైన్ కూడా విధిస్తున్నారు. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ వల్ల లాక్డౌన్ ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగించారు.
మరోవైపు రష్యాలో కరోనా వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదు అయినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

