Nuclear Secrets | శాండ్విచ్లో పెట్టి అణురహస్యాలు అమ్మేసిన ఇంజినీర్ దంపతులు!
Nuclear Secrets | అమెరికాకు చెందిన ఒక న్యూక్లియర్ ఇంజినీర్, అతని భార్య దేశ రహస్యాలను అమ్మేసుకుంటూ పట్టుబడ్డారు. ఒక అండర్‌కవర్ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కు వీరిద్దరూ ఈ రహస్యాలను అమ్మినట్లు

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఒక న్యూక్లియర్ ఇంజినీర్, అతని భార్య దేశ రహస్యాలను అమ్మేసుకుంటూ పట్టుబడ్డారు. ఒక అండర్‌కవర్ ఎఫ్‌బీఐ ఏజెంట్‌కు వీరిద్దరూ ఈ రహస్యాలను అమ్మినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. జొనాథన్ టోబె, అతని భార్య డయానా ఇద్దరూ కూడా ఈ డీల్స్ ద్వారా భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం.
నేవీలో న్యూక్లియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జొనాథన్‌కు టాప్ లెవెల్ క్లియరెన్స్ ఉంది. దీన్ని ఉపయోగించుకున్న ఈ దంపతులు నేవీకి చెందిన కొన్ని సబ్మెరీన్ రహస్యాలను ఒక విదేశీయుడికి అమ్మకానికి పెట్టారు. ఆ విదేశీయుడిలా వీరిద్దరినీ కలిసింది ఒక అండర్‌కవర్ ఎఫ్‌బీఐ అధికారే. ఒకసారి సగం తినేసిన శాండ్విచ్లో సబ్మెరీన్ రహస్యాలున్న మెమరీ కార్డు ఉంచి పడేశారీ దంపతులు. దాన్ని విదేశీయుడిలా నటిస్తున్న అధికారి ఆ తర్వాత తీసుకున్నాడు.
మరోసారి బబుల్ గమ్ కాగితంలో మెమరీ కార్డ్ చుట్టి కూడా రహస్యాలు చేరవేశారు. ఈ మెమరీ కార్డుల్లో వర్జీనియా క్లాస్ సబ్మెరీన్ రియాక్టర్‌కు సంబంధించిన మిలటరీ స్థాయి రహస్యాలు ఉన్నట్లు న్యాయశాఖ వెల్లడించింది. ఇలా రహస్యాలు చేరవేసినందుకు జొనాథన్ దంపతులు క్రిప్టోకరెన్సీ రూపంలో సుమారు లక్ష డాలర్లు తీసుకున్నట్లు తెలిపింది. మేరీల్యాండ్‌కు చెందిన ఈ జంటపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

