Cosmos 482 | భూమిపై పడిపోయిన కాస్మోస్ 482..! ఇది సోవియట్ కాలం నాటి స్పేస్‌క్రాఫ్ట్..!
Cosmos 482 | సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్‌క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్సరాల తర్వాత మళ్లీ భూమిని తాకింది.
Cosmos 482 | సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్‌క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్సరాల తర్వాత మళ్లీ భూమిని తాకింది. ఈ విషయాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ ధ్రువీకరించాయి. హిందూ మహాసముద్రం మీదుగా పడిపోయిందని రష్యా తెలిపింది. అయితే, పలువురు నిపుణులు మాత్రం ఎక్కడ పడిపోయిందో ఖచ్చితంగా గుర్తించలేకపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. 1972లో సోవియట్ యూనియన్ శుక్రగ్రహంపై చేపట్టిన మిషన్ కాస్మోస్ 482. ఈ ప్రయోగం విఫలం కావడంతో సుమారు 500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష నౌక భూ కక్ష్యలోనే ఉండిపోయింది. దాదాపు సుమారు అర దశాబ్దానికి పైగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టింది ఈ శాటిలైట్.
అయితే, కాస్మోస్ విడి భాగాల్లో చాలా వరకు విడిపోయి భూమిపై పడిపోయాయి. సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే శుక్రగ్రహంపై ప్రయోగం చేపట్టేందుకు కాస్మోస్‌కు టిటానియం రేకు రక్షణగా ఉండడంతో చెక్కుచెదరలేదని నిపుణులు పేర్కొంటున్నారు. శనివారం అంతరిక్ష నౌక ఎలాంటి నియంత్రణ లేకుండా భూమి వాతావరణంలోకి ప్రవేశించిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఎక్కడ పడిపోతుందో ఖచ్చితమైన సమాచారం లేదని నిపుణులు చెప్పారు. అయితే, యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (EUSST) అంతరిక్ష నౌక ఇకపై భూమి కక్ష్యలో లేదని పేర్కొంది. అదే సమయంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ ఆఫీస్ కూడా అంతరిక్ష నౌక తిరిగి భూమి కక్షలోకి వచ్చినట్లు చెప్పింది. జర్మన్ రాడార్ స్టేషన్లో కనిపించకపోవడంతో అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఏజెన్సీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

