స్వల్ప మార్పులకు లోనై వ్యాప్తి
లండన్: ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తున్న కరోనా వైరస్ గబ్బిలాల నుంచే మనుషులకు సోకిందని తాజాగా మరో అధ్యయనం వెల్లడించింది. మనుషులకు వ్యాప్తి చెందడానికి వైరస్ అతి స్వల్ప మార్పులకు లోనయినట్టు స్కాట్లాండ్ పరిశోధకులు పేర్కొన్నారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పొందేందుకు గబ్బిలాలు, పాంగోలిన్లు వంటి క్షీరదాల్లో కరోనా వైరస్ తొలుత కొన్ని ఉత్పరివర్తనాలకు లోనయినట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వివరాలు ‘ప్లాస్ బయాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.