Koh-i-Noor | బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం.. కోహినూర్లేని కిరీటంతోనే పట్టాభిషేకానికి రాణి కెమిల్లా..!
మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు.. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు.
Koh-i-Noor | మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని నిర్ణయించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్ రాచకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త, కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్ రాణి కెమిల్లా నిర్ణయించారు. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా (Queen Consort Camilla) కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించినా.. చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టారు.
ఈ కిరీటానికి బదులు.. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేందుకు ఈ కిరీటం పరిమాణంలో మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదగనున్నారు. కాగా, ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేకం జరుగుతుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్ వజ్రాలంకరణ ఆమె మరణించేదాకా కొనసాగింది. దౌత్యపరంగా సున్నితమైన అంశాల కారణంగానే రాణి కెమిల్లా కోహినూర్‌కు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగిస్తే భారత్‌తో దౌత్య పరమైన సమస్యలు తలెత్తొచ్చని బ్రిటన్‌లో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కోహినూర్‌ను తిరిగిచ్చేయాలని భారత్ ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్ను కోరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

