Watch: అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని.. సిగరెట్ తాగుతూ వర్చువల్ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జీ
24 ఏళ్ల మహిళా న్యాయమూర్తి వివియన్ పోలానియా, అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని కనిపించింది. అంతేగాక ఆమె సిగరెట్ తాగుతూ నిందితుడి బెయిల్ విచారణలో పాల్గొంది.
బొగోటా: ఒక మహిళా న్యాయమూర్తి అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని, సిగరెట్ తాగుతూ కోర్టు వర్చువల్ హియరింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమెను కొన్ని నెలలు సస్పెండ్ చేశారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో ఈ సంఘటన జరిగింది. 2021 జూన్‌లో ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద కారు బాంబు పేలుడు కేసుపై ఈ నెల 18న వర్చువల్‌గా విచారణ జరిగింది. ఈ సందర్భంగా 24 ఏళ్ల మహిళా న్యాయమూర్తి వివియన్ పోలానియా, అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని కనిపించింది. అంతేగాక ఆమె సిగరెట్ తాగుతూ నిందితుడి బెయిల్ విచారణలో పాల్గొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దీనిపై విమర్శలతోపాటు ఫిర్యాదులు రావడంతో నార్టే డి శాంటాండర్కు చెందిన జ్యుడిషియల్ డిసిప్లినరీ కమిషన్ స్పందించింది. మహిళా జడ్జీ వివియన్ పోలానియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు ఆమెను సస్పెండ్ చేసింది.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను వివియన్ పోలానియా ఖండించింది. వర్చువల్ విచారణ మధ్యలో బీపీ పడిపోయిందని, దీంతో ఆందోళన చెందిన తాను బెడ్‌పై వాలినట్లు మీడియాకు తెలిపింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ మహిళా జడ్జీ పోస్ట్ చేసిన వ్యక్తిగత ఫొటోలపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈసారి కోర్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు.
En un video que circula por WhatsApp se ve a la jueza Vivian Polanía (trabaja en el Palacio de Justicia de Cúcuta) atendiendo una diligencia judicial en su cama, semidesnuda y fumando. No sé si esto pueda acarrearle alguna sanción, pero al menos el escándalo ya está servido. pic.twitter.com/9rgNx4C6pV
— Manolesco (@jhonjacome) November 17, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

