అమెరికా తొలి నల్లజాతి మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్.. కరోనాతో మృతి

వాషింగ్టన్: అమెరికా తొలి నల్లజాతి మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ కరోనాతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ మేరకు సోమవారం ప్రకటించారు. ‘వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్లోని వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఎంతో ప్రేమించే భర్త, తాత, గొప్ప అమెరికన్‌ను కోల్పోయాం’ అని పావెల్ కుటుంబం తెలిపింది. 84 ఏండ్ల కోలిన్ పావెల్ ప్రసంగ ధాటి, అత్యున్నత చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం, సైనికుడిగా గౌరవ విధులను ప్రదర్శించారని ఆయన కుటుంబం కొనియాడింది. ఆయనలోని ఈ లక్షణాలు ఈ దేశ ప్రజలకు గొప్ప ప్రతినిధిగా చేశాయని సోషల్ మీడియాలో పేర్కొంది.
అమెరికా వార్ హీరో అయిన కోలిన్ పావెల్ రిటైర్డ్ ఫోర్-స్టార్ జనరల్. నలుగురు అధ్యక్షులకు సేవలందించిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్. రాజకీయ గొడవలకు దూరంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తిగా ఆయన ఖ్యాతిని గడించారు. 2000లో జార్జ్ బుష్ అడ్మినిష్ట్రేషన్‌లో అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 2003లో ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించారు.
2003 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగించిన కోలిన్ పావెల్, ఇరాక్‌లో సామూహిక విధ్వంసక రసాయన ఆయుధాలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే నాడు ఆయన సమర్పించిన ఆధారాలు తప్పని ఆ తర్వాత నిరూపితమైంది. 2005లో ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆయన చాలా బాధపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

