రష్యాలో కోకా కోలా, పెప్సీకో అమ్మకాలు బంద్
Coca cola | ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నది. అమెరికన్ కంపెనీలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్, వీసా, మాస్టర్‌కార్డ్, యూట్యూట్, ఫేస్బుక్, ట్విటర్ వంటి సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా ఆపివేశాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి కంపెనీలైన పెప్సీకో, కోకా కోలా చేరాయి.
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నది. అమెరికన్ కంపెనీలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్, వీసా, మాస్టర్‌కార్డ్, యూట్యూట్, ఫేస్బుక్, ట్విటర్ వంటి సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా ఆపివేశాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి కంపెనీలైన పెప్సీకో, కోకా కోలా చేరాయి. రష్యాలో తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నామని రెండు కంపెనీలు ప్రకటించాయి. వీటితోపాటు మెక్‌డొనాల్డ్, స్టార్‌బక్స్ కూడా రష్యాపై నిషేధం విధించాయి.
రష్యాలో తమ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు కోకా కోలా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న విషాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన ఉక్రెయిన్ ప్రజల వెంట తమ హృదయాలు ఉన్నాయని తెలిపింది. అక్కడ నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, దానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సోవియట్ యూనియన్ అంతరించిన తర్వాత రష్యాలో కోకాకోలా ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

ఇక మరో అపెద్ద కంపెనీ అయిన పెప్సీ కో కూడా తమన ఉత్పత్తుల అమ్మకాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పెప్సి కోలా, సెవనప్, మిరిండా వంటి బ్రాండ్ల అమ్మకాలను ఆపివేస్తున్నామని, వాటి ప్రకటనలను కూడా నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ రమన్ లాగౌర్టా చెప్పారు. అయితే నిత్యావసర వస్తువుల అమ్మకాలు కొనసాగుతాయని తెలిపారు. కాగా, రష్యాలో పెప్సీకో గత 60 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నది.
వీటితోపాటు మెక్‌డొనాల్డ్, స్టార్‌బక్స్ వంటి సంస్థలు కూడా రష్యాలను తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 2014లో క్రిమియాపై దాడి సందర్భంగా కూడా పలు అమెరికన్ కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాన్ని నిలిపివేశాయి. అనంతరం యధావిధితా బిజినెస్ కొనసాగిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

