CNN: వ్యాక్సిన్ వేసుకోలేదని.. ముగ్గురు ఉద్యోగుల్ని తొలగించిన సీఎన్ఎన్

న్యూయార్క్: వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వస్తున్న ముగ్గురు ఉద్యోగులను సీఎన్ఎన్ ( CNN ) వార్తా సంస్థ తొలగించింది. సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుకర్ ఈ విషయాన్ని ఓ మెమో ద్వారా తోటి ఉద్యోగులకు తెలియజేశారు. ఆఫీసుకు రావాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని ఆయన ఆ మెమోలో స్పష్టం చేశారు. ఫీల్డ్ రిపోర్టింగ్‌కు వెళ్లే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, ఎందుకంటే వాళ్లు బయటిప్రదేశంలో మరొకరితో టచ్‌లోకి వస్తుంటారని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని ఏ విధంగానూ సహించబోమన్నారు. అయితే ఆ ఉద్యోగులు ఎవరు, వాళ్లు ఎక్కడ పనిచేస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. స్వచ్ఛంధంగా సీఎన్ఎస్ వార్తా సంస్థ ఆఫీసులను తెరుస్తున్నారు. న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న మూడవ వంతు సిబ్బంది ఆఫీసుకు వస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికేట్ ఉండాలన్నది. అట్లాంటా, వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఆఫీసుల్లో మాస్క్ కూడా తప్పనిసరిగా ధరించాలని సీఎన్ఎన్ చెప్పింది. ఇటీవల అమెరికాలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఆఫీసుకు రావాలన్న నిబంధనలను మిడ్ అక్టోబర్ వరకు పొడిగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- CNN
- Covid vaccine
- Unvaccinated
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

