Watch: స్కూల్ బస్సు నడుపుతూ స్పృహ తప్పిన డ్రైవర్.. ఒక విద్యార్థి ఏం చేశాడంటే?
Viral Video | స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న 7వ తరగతి విద్యార్థి ఆ డ్రైవర్ పరిస్థితిని గమనించాడు. సహాయం కోసం వెంటనే ముందుకు వచ్చాడు. స్టీరింగ్ పట్టుకుని బ్రేకులపై కాలు నొక్కిపెట్టి స్కూల్ బస్సు నిలిచేలా చేశాడు. ఆ వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ మిగతా విద్యార్థులకు చెప్పాడు.
వాషింగ్టన్: స్కూల్ బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ ఉన్నట్టుండి స్పృహ తప్పింది. గమనించిన ఒక విద్యార్థి వెంటనే స్పందించాడు. ముందుకు వచ్చి స్టీరింగ్ పట్టుకుని బస్సు బ్రేకులు నొక్కిపెట్టి దానిని నిలిపివేశాడు. ఆ బస్సులోని 66 మంది స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా కాపాడాడు. దీంతో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సాహసాన్ని ఆ స్కూల్ యాజమాన్యంతో పాటు అంతా ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. బుధవారం అమెరికాలోని మిచిగాన్‌లో వారెన్ కన్సాలిడేటెడ్ స్కూల్‌కు చెందిన బస్సులో 66 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సు నడువుపుతున్న మహిళా డ్రైవర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. స్కూల్ బస్సును నడపలేని స్థితిలో ఉన్న ఆమె ఈ విషయాన్ని సంబంధిత రవాణా సంస్థకు తెలిపింది. అనంతరం బస్సును నిలిపేందుకు ప్రయత్నిస్తూ స్పృహ తప్పింది.
కాగా, ఆ స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న 7వ తరగతి విద్యార్థి డిల్లాన్ రీవ్స్, డ్రైవర్ పరిస్థితిని గమనించాడు. సహాయం కోసం వెంటనే ముందుకు వచ్చాడు. స్టీరింగ్ పట్టుకుని బ్రేకులపై కాలు నొక్కిపెట్టి స్కూల్ బస్సు నిలిచేలా చేశాడు. ఆ వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ మిగతా విద్యార్థులకు చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆ బస్సు వద్దకు వచ్చారు. స్పృహ తప్పిన మహిళా డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. మరో స్కూల్ బస్సును రప్పించి విద్యార్థులను వారి ఇళ్లకు పంపారు.
మరోవైపు విద్యార్థి డిల్లాన్ రీవ్స్ చొరవ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీస్ అధికారి తెలిపారు. ఆ స్కూల్ యాజమాన్యం కూడా గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు కలిసి డిల్లాన్ రీవ్స్‌ను అభినందించారు. అతడి ధైర్యం, చొరవను ప్రశంసించారు. కాగా, డ్రైవర్ స్పృహ తప్పడాన్ని గమనించిన ఆ విద్యార్థి వెంటనే ముందుకు వచ్చి సురక్షితంగా బస్సును నిలిపిన సంఘటన అందులోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా విద్యార్థి డిల్లాన్ రీవ్స్ చొరవ, సాహసాన్ని కొనియాడారు.
https://youtu.be/_QTLWx0iqFA
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bus driver
- Others
- Saves
- Unconscious
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

