మిలిటరీ గ్రేడ్ లేజర్‌తో చైనా అటాక్ చేసింది: పిలిప్పీన్స్
laser attack:గ్రీన్ లేజర్ బీమ్‌తో చైనా నౌక తమపై అటాక్ చేసినట్లు పిలిప్పీన్స్ కోస్టు గార్డు ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఈ ఘటన జరిగింది.
మనీలా: దక్షిణ చైనా జలాల్లో తమ నౌకపై చైనా నౌక లేజర్ బీమ్‌తో అటాక్ చేసినట్లు పిలిప్పీన్స్ కోర్టు గార్డు ఆరోపించారు. చైనా కోస్టు గార్డుకు చెందిన ఓ నౌక.. మిలిటరీ గ్రేడ్ లేజర్‌తో తమ నౌకకు సమీపంగా వచ్చినట్లు పిలిప్పీన్స్ కోస్టు గార్డు తెలిపింది. గత వారం ఈ ఘటన జరిగింది. తమ నౌకకు దాదాపు 137 మీటర్ల దూరం వరకు వచ్చి ప్రమాదకర రీతిలో చైనా కోస్టు గార్డు నౌక వ్యవహరించినట్లు పిలిప్పీన్స్ ఆరోపించింది.
లేజర్ బీమ్‌తో నౌకలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన విజువల్స్‌ను కూడా పిలిప్పీన్స్ కోస్టు గార్డు తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. గ్రీన్ కలర్ లేజర్ బీమ్‌ను చైనా వాడినట్లు ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది.ఫిబ్రవరి ఆరో తేదీన అయున్జిన్ షోల్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన పట్ల చైనా విదేశీంగ శాఖ భిన్నమైన ప్రకటన చేసింది. తమ అనుమతి లేకుండా రీనాయ్ రీఫ్ జలాల్లోకి పిలిప్పీన్స్ నౌక ప్రవేశించినట్లు చైనా విదేశాంగ శాఖ తనప్రకటనలో పేర్కొన్నది. చైనీస్ గస్తీ నౌకలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా విదేశీ నౌకను అడ్డుకున్నట్లు చైనా తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న సుమారు 1.3 మిలియన్ల స్క్వేర్ మైళ్ల ప్రాంతంపై చైనా ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

