వుహాన్ ల్యాబ్ లీక్‌పై నోరు విప్పిన చైనా సైంటిస్టు

బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు క్రమంగా బలం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ల్యాబ్‌కు చెందిన ప్రముఖ చైనీస్ సైంటిస్ట్ డాక్టర్ షి ఝెంగ్లి నోరు విప్పారు. ఈ విపత్తుకు తన ల్యాబ్‌ను నిందించడం సరి కాదని ఆమె అన్నారు. అసలు ఆధారాలే లేకుండా నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని న్యూయార్క్ టైమ్స్‌కు పంపిన మెయిల్లో డాక్టర్ షి అన్నారు. అసలు ల్యాబ్‌లో లీకైందన్న వాదనను ప్రపంచం ఎలా అంగీకరిస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఓ అమాయక సైంటిస్టుపై పదే పదే నిందలు మోపుతున్నారు అని ఆమె వాపోయారు.
ల్యాబ్ లీకు వాదనతోపాటు అసలు కరోనా మూలాలపై విచారణ జరపాలని ఈ మధ్యే అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా వచ్చిన తొలి నాళ్ల నుంచి కూడా అది వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందన్న వాదన ప్రారంభమైంది. ఈ ల్యాబ్‌కు చెందిన ముగ్గురు సైంటిస్టులు ఓ గుహలోకి గబ్బిలాల కోసం వెళ్లి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం ఈ వాదనకు బలం చేకూర్చింది.
రాబోయే కాలంలో ఎలాంటి వైరస్లు పుట్టుకొస్తాయి, వాటి బలం ఎంత, ఎలాంటి ప్రభావాలు చూపుతాయి అన్నదానిపై వుహాన్ ల్యాబ్‌లో జరిగిన ప్రయోగాలకు గబ్బిలాల కరోనావైరస్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ షినే నేతృత్వం వహించారని పలువురు సైంటిస్టులు తెలిపారు. అయితే తమ ప్రయోగాలు వైరస్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి కావని, ఇతర జాతులకు వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించామని తాజా మెయిల్లో డాక్టర్ షి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

