యుద్ధం మొదలైనప్పటి నుంచి… ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడని చైనా అధ్యక్షుడు
బీజింగ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై నెల రోజులైంది. దీని గురించి ప్రపంచ అధినేతలు ఒకరితో మరొకరు మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా చాలా దేశాల అధ్యక్షులు, ప్రధానులు మాట్లాడారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దీనికి మినహాయింపు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభం నుంచి ప్రపంచంలోని ఎనిమిది అగ్ర దేశాధినేతలతో ఆయన మాట్లాడారు. గత నెల రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి ఎనిమిది దేశాధినేతలతో ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలకు సంబంధించి ఫోన్లో చర్చించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరుపాలని పుతిన్‌కు కూడా ఆయన సూచించారు. అయితే జిన్‌పింగ్ ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం ఒక్కసారి అయినా మాట్లాడలేదు.
ఈ నేపథ్యంలో బుధవారం నాటి వారాంతర బ్రీఫింగ్ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దీంతో ఉక్రెయిన్ సమస్యపై చైనాకు ‘సున్నితమైన కమ్యూనికేషన్’ ఉందని ఆయన తెలిపారు. అవిభాజిత భద్రతా భావనను సమర్థించడానికి అందరికీ చైనా మద్దతు ఇస్తుందని చెప్పారు.
కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పరిమితులు లేని భాగస్వామ్యం ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫిబ్రవరి 4న అన్నారు. అయితే రష్యాపై ఆంక్షలు విధించడంతోపాటు తమకు అండగా ఉండాలంటూ పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరడంతోపాటు దీని కోసం చాలా కఠినంగా, రెచ్చగొట్టేలా మాట్లాడటం కూడా జిన్‌పింగ్‌కు నచ్చలేదని తెలుస్తున్నంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఆయన సుముఖంగా లేనట్లు కనిపిస్తున్నది. అంతేగాక జెలెన్స్కీకి మద్దతిచ్చిన జీ 7తో సహా 17 దేశాధినేతలతో కూడా జిన్‌పింగ్ మాట్లాడలేదు.
మరోవైపు రష్యాతోపాటు ఉక్రెయిన్‌తో కూడా చైనాకు బలమైన సంబంధాలు ఉన్నాయని, శాంతియుత చర్చలకు ఇది ఎంతో మేలు చేస్తుందని చైనాలోని అమెరికా రాయబారి అభిప్రాయపడ్డారు. అయితే జిన్‌పింగ్, జెలెన్స్కీ మధ్య మౌనం, చైనా మధ్యవర్తిత్వంపై అనుమానాలు రేకెత్తిస్తున్నదని ఆయన విమర్శించారు. కాగా, జిన్‌పింగ్, జెలెన్స్కీ త్వరలోనే మాట్లాడుకుంటారని జెలెన్స్కీ అనుచరుడు ఆండ్రీ యెర్మాక్, మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

