బీజింగ్: చైనా కరెన్సీ యువాన్ డీలాపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనం అయ్యింది. 2011 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అంతర్జాతీయంగా యువాన్ కరెన్సీ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. చైనీయులు దేశీయ కరెన్సీ కూడా చాలా హీనదశకు చేరుకున్నది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా కరెన్సీ కూడా దారుణంగా పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ పెరుగుతోంది. ఇటీవల అమెరికా సెంట్రల్ బ్యాంకు తన వడ్డీ రేట్లను కూడా పెంచింది. మరో వైపు బుధవారం ఆసియా దేశాల్లోని ప్రధాన స్టాక్ మార్కెట్లు అన్నీ కుప్పకూలిన విషయం తెలిసిందే. హాంగ్‌కాంగ్‌లోని హంగ్ సెంగ్, దక్షిణ కొరియాలోని కోస్పి కరెన్సీ కూడా రెండు శాతం డౌన్ అయ్యింది. జపాన్‌లోని నిక్కీ ఇండెక్స్ కూడా 1.5 శాతం పడిపోయింది.