చైనాలో విజృంభిస్తున్న కరోనా.. మరో మూడు నెలలు గరిష్ఠ స్థాయిలో కేసులు
కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మరోవార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరో 2-3 నెలల వరకు అక్కడ కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచానా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
China Covid | కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మరోవార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరో 2-3 నెలల వరకు అక్కడ కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచానా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం డ్రాగన్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత మూడేళ్లుగా కొవిడ్ నిబంధనల మధ్య మగ్గిన చైనీయులు.. వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో తీవ్రదశ ఇంకా ముగియలేదని అక్కడ అధికారి ఒకరు తెలిపారు. వైరస్ విషయంలో ఇప్పటి వరకు ప్రాధాన్యత అంతా నగరాలపైనే ఉందని చెప్పారు. అయితే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

