Chang’e-6 | చరిత్ర సృష్టించిన చాంగే-6.. భూమికి బయల్దేరిన చైనా లూనార్ ప్రోబ్
Chang’e-6 | చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్.. అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్ బయలుదేరినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) మంగళవారం ప్రకటించింది.
- 25న ఇన్నర్ మంగోలియాలో దిగే అవకాశం
బీజింగ్, జూన్ 4: చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవల చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్.. అక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకుని ఈ ప్రోబ్ బయలుదేరినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) మంగళవారం ప్రకటించింది.
చంద్రుని ఆవలి ప్రాంతంలో గత రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6.. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటల 38 నిమిషాలకు చంద్రుని ఉపరితలం నుంచి బయల్దేరిందని, అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలను ఇది సమర్థంగా తట్టుకోగలిగిందని సీఎన్ఎస్ఏ పేర్కొన్నట్టు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ నెల 25న చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఈ ప్రోబ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. చరిత్రాత్మకమైన ఈ ఫీట్‌తో ఇప్పటివరకూ ఎవరూ అన్వేషించని చంద్రుని చీకటి భాగం నుంచి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా నిలువనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

