Online Videos: వీడియోలు చేస్తూ వారానికి 120 కోట్లు సంపాదిస్తున్న మహిళ
Online Videos: చైనాకు చెందిన ఓ మహిళ తన వీడియోలతో కోట్లు కోట్లు తన ఖాతాలో వేసుకుంటోంది. జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే మహిళ చైనా సోషల్ మీడియాలో పాపులర్. ప్రతి వారం ఆమె తన వీడియోలతో సుమారు 120 కోట్లు సంపాదిస్తున్నారు.
బీజింగ్: ఇప్పుడంతా ఆన్లైన్ మాయాజాలం నడుస్తోంది. రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వీడియోలు(Online Videos) చేస్తూ కొందరు తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్లో ఫాలోవర్లను పెంచుకుంటూ దండిగా ఆర్జిస్తున్నారు. చిత్రవిచిత్రమైన కాంటెంట్‌ను పోస్టు చేస్తూ ఈజీగా తమ అకౌంట్లలోకి డబ్బు వచ్చేలా చేస్తున్నారు.
ఇక చైనాకు చెందిన ఓ మహిళ .. తన వీడియోలతో కోట్లు కోట్లు తన ఖాతాలో వేసుకుంటోంది. జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే మహిళ చైనా సోషల్ మీడియాలో పాపులర్. వివిధ రకాల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఆమె చేసే వీడియోలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. టిక్‌టాక్ లాంటి డోయున్ యాప్‌లో ఆమెకు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్లో ఆమె వీడియోలను పోస్టు చేస్తూ మెరుపు వేగంతో ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసింది.
కేవలం మూడు సెకన్లలోనే ఆమె ఎటువంంటి ప్రాడక్టు అయినా ప్రమోట్ చేస్తుంది. క్షణాల్లోనే రకరకాల ఉత్పత్తులను తన వీడియోల్లో చూపిస్తుంది. ఆ వీడియోలకు ఆమె భారీ స్థాయిలో ఆర్జిస్తున్నది. జెంగ్ ప్రతి వారం సుమారు 120 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ర్యాపిడ్ ఫైర్ శైలిలో ఆమె చేసే వీడియోలకు తెగ ఆదాయం వస్తోందని ఆన్లైన్ నిపుణులు చెబుతున్నారు. ఆమె ప్రమోషన్ టెక్నిక్‌తో ఉత్పత్తులు కూడా చాలా వేగంగా అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

