చైనా విమాన ప్రమాదం ఘటనలో లభించిన రెండో బ్లాక్ బాక్స్
black box | చైనాలో విమానం కుప్పకూలిన ఘటనలో ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరో ముందడుగుపడింది. గత నాలుగు రోజులుగా యాక్సిడెంట్ జరిగిన గ్వాంగ్జీ పర్వత ప్రాంతాల్లో జల్లడపడుతున్న రెస్క్యూ సిబ్బందికి రెండో బ్లాక్ బాక్స్ (black box) లభించింది.
బీజింగ్: చైనాలో విమానం కుప్పకూలిన ఘటనలో ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరో ముందడుగుపడింది. గత నాలుగు రోజులుగా యాక్సిడెంట్ జరిగిన గ్వాంగ్జీ పర్వత ప్రాంతాల్లో జల్లడపడుతున్న రెస్క్యూ సిబ్బందికి రెండో బ్లాక్ బాక్స్ (black box) లభించింది. దీనిద్వారా అసలు ప్రమాదం ఎలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉన్నది. కాగా, విమానం కూలిపోయిన రెండు రోజుల తర్వాత అంటే గత బుధవారం అందులోని మొదటి బ్లాక్ బాక్స్ లభించింది. ప్రస్తుతం నిపుణులు దానిని డీకోడ్ చేసి విశ్లేషిస్తున్నారు.

ఈనెల 21న (సోమవారం) 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిపోవడంతో అడవికి పెద్దయెత్తున మంటలు అంటుకొన్నాయి. భూమికి 26 వేల అడుగుల ఎత్తు పైనుంచి సరాసరిగా విమానం నేలపై కూలిపోయినట్టు ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్ ‘ఫ్లైట్రాడార్24’ వెల్లడించింది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇది జరిగినట్టు వివరించింది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

