చరిత్రలో ఈరోజు: అంతరిక్షంలోకి చింపాజీ.. మానవుడు వెళ్లేందుకు మార్గం
Today History: అంతరిక్షంలోకి తొలిసారి ఒక చింపాంజీ 1961 లో సరిగ్గా ఇదే రోజున బయల్దేరి వెళ్లింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జంతువుగా చరిత్ర సృష్టించింది. మనిషి అంతరిక్షంలోకి...

Today History: అంతరిక్షంలోకి తొలిసారి ఒక చింపాంజీ 1961 లో సరిగ్గా ఇదే రోజున బయల్దేరి వెళ్లింది. 1959 లో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చిన తర్వాత ఈ చింపాజీకి రకరకాల పరీక్షలు చేసి.. ఎన్నో బుద్ధులు నేర్పారు. తొలుత ఈ చింపాంజీ పేరు #65 చాంగ్. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత హైమ్ అని పేరు మార్చారు. హైమ్ అనే ఈ చింపాంజీ.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి జంతువుగా చరిత్ర సృష్టించింది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తే అతడిపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే సమాచారం తెలుసుకునేందుకే ఈ చింపాంజీని అంతరిక్షంలోకి పంపారు.
1957లో జన్మించిన ఈ చింపాంజీని కామెరూన్ అడవుల నుంచి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి తీసుకొచ్చారు. ఫ్లోరిడాలోని మయామి రేర్ బర్డ్ ఫర్మ్‌లో దీనికి నివాసం కల్పించారు. 1959లో అంతరిక్షంలో శిక్షణ కోసం అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్‌కు పంపించారు. 18 నెలల శిక్షణ అనంతరం హైమ్ అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమైంది. మూడున్నరేండ్ల వయసున్న చింపాంజీని కంటైనర్‌లో కట్టి అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోకి ప్రవేశించే సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హైమ్ ప్రయాణిస్తున్న క్యాప్సూల్ దెబ్బతిన్నది. అయితే, హైమ్ వేసుకున్న స్పేస్ సూట్ దానిని క్షేమంగా ఉంచగలిగింది.
భూమికి తిరిగి వస్తున్న సమయంలో హైమ్ ప్రయాణిస్తున్న క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది. దానిని కాపాడేందుకు ఓడ గంటల వ్యవధిలో ఘటనాస్థలికి చేరుకున్నా హైమ్కు ఎలాంటి నష్టం జరుగలేదు. క్యాప్సూల్లోంచి బయటకు తీసి భద్రంగా ఫ్లోరిడాకు తీసుకెళ్లారు. అనంతరం 1963లో వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో నివాసం ఏర్పాటుచేసి పెంచారు. తర్వాత కొన్ని రోజులకు నార్త్ కరోలినా జూకి పంపారు. కాగా, హైమ్ 1983 జనవరి 19 న మరణించింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2020: యూరోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన బ్రిటన్
2010: ప్రపంచంలోనే 2 బిలియన్ డాలర్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచిన అవతార్
2004: పాకిస్తాన్ ప్రధాని వ్యక్తిగత సలహాదారు పదవి నుంచి పాకిస్తానీ అణు కార్యక్రమం పితామహుడు డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ తొలగింపు
1996: శ్రీలంకలో ఆత్మాహుతి దాడి, 86 మంది దుర్మరణం
1966: మానవ రహిత లూనా-9 అంతరిక్ష నౌకను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1975: బాలీవుడ్ నటి ప్రీతి జింటా జననం
1958: మొదటి కృత్రిమ అంతరిక్ష ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన అమెరికా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

