ఊసరవెల్లి రోబో

- సెకండ్ల వ్యవధిలో వివిధ రంగుల్లోకి..
- పరిసరాలు, ఉష్ణోగ్రతను బట్టి మార్పులు
- మిలిటరీ కార్యకలాపాల్లో చక్కని పనితీరు
- గూఢచారిగానూ విలువైన సమాచార సేకరణ
- దక్షిణ కొరియా శాస్త్రవేత్తల ఆవిష్కరణ
శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలకు ప్రకృతి పాఠాలు పునాదిలాంటివన్న సంగతి ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. శత్రువుల నుంచి స్వీయరక్షణ కోసం.. పరిసరాలకు అనుగుణంగా రంగులు మార్చే ఊసరవెల్లి.. ఓ యుద్ధ రోబో రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది.
రంగుల బల్లపై అప్పుడే కనిపించిన ఓ ఆకుపచ్చ రంగు చిట్టి రోబో సెకను కాలంలో ఎక్కడికి వెళ్లిందో అక్కడున్న వారెవరికీ అర్థంకాలేదు. ఇంతలో నీలం రంగులో ఉన్న మరో రోబో ప్రత్యక్షమైంది. ఆ వెంటనే దాని స్థానంలో నారింజ రంగు మరో రోబో.. దక్షిణ కొరియాలోని సియోల్లో ఇటీవల జరిగిన ఓ సైన్స్ ఎగ్జిబిషన్లో ‘కృత్రిమ ఊసరవెల్లి రోబో’ చేసిన విన్యాసాలివి. సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఊసరవెల్లి రోబోను తయారుచేశారు.
ఎలా పనిచేస్తుంది?
పరిసరాల ఉష్ణోగ్రతను గ్రహించడానికి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ థర్మోక్రోమిక్ లిక్విడ్ క్రిస్టల్ లేయర్లు, పరిసరాల రంగు, పరిధిని అంచనా వేసేందుకు ప్రత్యేకమైన సెన్సర్లను రోబో ఉపరితలంపై ఏర్పాటు చేశారు. దీంతో పరిసరాల ఉష్ణోగ్రత, రంగులను బట్టి తన శరీర రంగును (ప్లాస్టిక్ కవచాన్ని) రోబో సెకండ్ల వ్యవధిలో మార్చుకుంటుందని ప్రొఫెసర్ సియంగ్ వాన్ కో తెలిపారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఈ రోబోను ఓ గూఢచారిగానూ, దాడులు చేయడానికి కూడా వినియోగించుకోవచ్చన్నారు.
అసలు ఉద్దేశమేమిటి?
శత్రుస్థావరాలలోకి వెళ్లి రహస్యాలు తెలుసుకొని రావడం లేదా దాడులు చేయడం యుద్ధ క్షేత్రంలోని సైనికులకు అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారం. శత్రువుల నిఘాకు చిక్కకుండా చేయాల్సిన ఈ మిషన్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుంది. చెట్లు, పుట్టల్లో కలిసిపోయే ఊసరవెల్లిలా.. పర్వతాలు, లోయలు, అడవుల్లో కలిసిపోతూ శత్రువుల కంటికి చిక్కకుండా ఈ మిషన్ను సైనికులు పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే, వివిధ దేశాల సైనిక బలగాల యూనిఫాం కోడ్, నిబంధనలు ఈ ప్రక్రియను మరింత క్లిష్టతరంగా మారుస్తున్నాయి. దీనికి పరిష్కారాన్ని చూపుతూ సియోల్ శాస్త్రవేత్తలు ‘కృత్రిమ ఊసరవెల్లి రోబో’ను తీసుకొచ్చారు. పరిసరాల రంగులకు తగినట్టు సెకండ్ల వ్యవధిలో రంగులను మారుస్తూ, 24 గంటల పాటు పనిచేసేలా దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్తో ఈ రోబోను తయారు చేశారు. పేలుడు పదార్థాలను సైతం ఎటువంటి శబ్దం లేకుండా మోసుకెళ్లడం, శత్రువుల సమాచారాన్ని రికార్డు చేసుకోగల కమ్యూనికేషన్, సెన్సర్ వ్యవస్థ కలిగిఉండటవం ఈ రోబో ప్రత్యేకత.
ఊసరవెల్లి రోబో ఆకారం ఇలా..
- పొడవు: ఒక అడుగు మూడు అంగుళాలు
- వెడల్పు: ఆరు అంగుళాలు
- బరువు: ఒక కిలో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

