రౌల్ రిటైర్మెంట్.. ముగిసిన క్యాస్ట్రో శకం

హవానా: క్యూబాలో క్యాస్ట్రో శకం ముగియనున్నది. కమ్యూనిస్టు పార్టీకి రౌల్ క్యాస్ట్రో గుడ్ బై చెప్పేశారు. పార్టీ నాయకత్వాన్ని యువతరానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ప్రారంభమైన పార్టీ సమావేశాల్లో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఆరు దశాబ్దాల పాటు క్యూబాను ఏలిన క్యాస్ట్రో పాలన ముగియనున్నది. రౌల్ క్యాస్ట్రో.. ఆయన సోదరుడు ఫిడేల్ క్యాస్ట్రో.. క్యూబాలో చాలా పాపులర్. 89 ఏళ్ల రౌల్ పార్టీ సమావేశంలో తన రిటైర్మెంట్ను ప్రకటించారు. పార్టీకి నమ్మకంగా పనిచేసినవారికే కొత్త నాయకత్వం లభిస్తుందన్నారు.
అమెరికా సామ్రాజ్యవాద పెత్తానికి వ్యతిరేకంగా క్యాస్ట్రో సోదరులు చేపట్టిన పోరాటం క్యూబాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టింది. తన తర్వాత పార్టీకి పగ్గాలు చేపట్టబోయే వారి కోసం నాలుగు రోజుల కాంగ్రెస్ సమావేశాల తర్వాత ఓటింగ్ జరుగుతుందని, దాంట్లో కొత్త నేత ఎవరో తెలుస్తుందని రౌల్ తెలిపారు. 1959లో అమెరికా వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో క్యాస్ట్రో శఖం మొదలైంది. అయితే 2016లో ఫిడెల్ క్యాస్ట్రో మరణించారు. ఇక ఇప్పడు రౌల్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో క్యూబా కమ్యూనిస్టు పాలనలో కొత్త తరం అనివార్యమైంది.
కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలు మిగుల్ డియాజ్ కానల్కు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనే ఆ దేశాధ్యక్షుడు. 2018లో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు కూడా ఆయనకే దక్కనున్నాయి. ఒకవేళ ఆయన ఆ పదవి స్వీకరిస్తే, ఇక క్యూబా ఆర్థిక వ్యవస్థను మరింత సరళతరం చేసే చర్యలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. 60 ఏళ్ల మిగుల్ను పార్టీ సమావేశాల్లో రౌల్ మెచ్చుకున్నారు. మిగుల్ కొత్త తరం నాయకుడని ప్రశంసించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

