Chief Candy Officer | తియ్యని ఉద్యోగం.. నెలకు రూ. 7లక్షల జీతం.. ఐదేళ్ల వయస్సు దాటినవారు అర్హులు!!
మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? వివిధ రకాల చాక్టెట్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలరా? ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినా రుచి చూడగలరా? అయితే, నెలకు రూ. 7లక్షలు సంపాదించొచ్చు. అంటే సంవత్సరానికి 84 లక్షలు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమండీ బాబు..యూకేకు చెందిన ఆన్లైన్ క్యాండీ రిటైలర్ 'క్యాండీ ఫన్‌హౌస్' అనే కంపెనీ 'చీఫ్ క్యాండీ ఆఫీసర్' (సీసీవో) పేరుతో ఈ జాబ్ ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల వయస్సు దాటినవారెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? వివిధ రకాల చాక్టెట్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలరా? ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినా రుచి చూడగలరా? అయితే, నెలకు రూ. 7లక్షలు సంపాదించొచ్చు. అంటే సంవత్సరానికి 84 లక్షలు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమండీ బాబు..యూకేకు చెందిన ఆన్లైన్ క్యాండీ రిటైలర్ ‘క్యాండీ ఫన్‌హౌస్’ అనే కంపెనీ ‘చీఫ్ క్యాండీ ఆఫీసర్’ (సీసీవో) పేరుతో ఈ జాబ్ ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల వయస్సు దాటినవారెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
‘క్యాండీ ఫన్‌హౌస్’ ఈ ఉద్యోగ ప్రకటనను జూలై 19న లింక్డ్ ఇన్‌లో ఉంచింది. ప్రపంచంలో ఇదే మొదటి, ఏకైక పొజిషన్ అని సంస్థ పేర్కొంది. అయితే, ఈ ఉద్యోగం ఉత్తర అమెరికాకు చెందినవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్స్‌లో పని చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. టొరెంటో, కెనడా, న్యూయార్క్, న్యూజెర్సీ, యూఎస్ఏలో ఉంటూ కూడా సీసీవోగా పని చేసుకోవచ్చు.
ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఆగస్టు 31, 2022 వరకు గడువు ఇచ్చింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి క్యాండీ తయారీ లేదంటే ఇతర అనుభవం ఉండాల్సిన పని లేదు. పని విషయానికొస్తే నెలకు 3,500 చాక్లెట్ ఉత్పత్తులను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దంతాల మీద ప్రభావం పడుతుంది కదా? అని ఆలోచిస్తున్నారా? అందుకే కంపెనీ డెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా అందిస్తోంది. అలాగే, సీసీవోగా ఎంపికైనవారు చాక్లెట్ ఉత్పత్తులను ఏవిధంగా మార్కెట్లోకి తీసుకెళ్లాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది. చాక్లెట్ బోర్డు సమావేశాలకు నాయకత్వం వహించాలి. హెడ్ టేస్ట్ టెస్టర్‌గా ఉంటూ ఆహ్లాదకర వాతావరణంలో బాధ్యతలు నిర్వర్తించాలి.
Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6
— Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

