కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై రాళ్ల దాడి

టొరంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన ఒంటారియోలోని లండన్‌లో చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఘటన జరగడం శోచనీయం. కోవిడ్ వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ప్రధాని ట్రూడోపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న రాళ్లతో జరిగిన దాడిలో ఎవరూ గాయపడలేదు. కానీ ప్రధాని జస్టిన్‌తో పాటు ఆయన సిబ్బందిపై కూడా ఆ రాళ్లు పడ్డాయి. ఓ బ్రెవరీని విజిట్ చేసి తిరిగి తన బస్సులోకి వస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కోవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రచార సభకు అడ్డుతిరిగారు. ఇటీవల ఆందోళనకారుల వల్ల ఓ ర్యాలీని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఒంటారియోలో జరిగిన ఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. తన భుజంపై ఆ చిన్న రాళ్లు తగిలాయని, కానీ దాంతో బెదిరేదిలేదన్నారు. ప్రధానిపై రాళ్లు రువ్విన ఘటనను ప్రతిపక్ష నేత ఖండించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కచ్చితం టీకా వేసుకోవాలని ట్రూడో ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. దీన్ని యాంటీ వ్యాక్సిన్ ఆందోళనకారులు తప్పుపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

