Canada Wildfire: కెనడా అడవుల నుంచి వస్తున్న పొగ.. నార్వేలోనూ కనిపిస్తోంది
Canada Wildfire: కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఆ దావానలం నుంచి దట్టమైన పొగ వస్తోంది. అయితే ఆ పొగ ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలను కమ్మేసింది. చాలా దట్టంగా వ్యాపిస్తున్న ఆ పొగ ఇప్పుడు అత్యంత దూరంలో ఉన్న నార్వేలోనూ దర్శనమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒట్టావా: కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు(Canada Wildfire) రగులుతున్న విషయం తెలిసిందే. ఆ దావానలం నుంచి దట్టమైన పొగ వస్తోంది. అయితే ఆ పొగ ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలను కమ్మేసింది. చాలా దట్టంగా వ్యాపిస్తున్న ఆ పొగ ఇప్పుడు అత్యంత దూరంలో ఉన్న నార్వేలోనూ దర్శనమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కెనడాలోని అడవుల్లో అంటుకున్న మంటల నుంచి వస్తున్న పొగ ఇప్పుడు గ్రీన్లాండ్, ఐస్లాండ్లోనూ కనిపిస్తోంది.
నార్వేలో ఉన్న క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ కార్చిచ్చు పొగను డిటెక్ట్ చేసింది. చాలా సున్నితమైన పరికరాల ద్వారా వాతావరణంలో కలుగుతున్న మార్పుల్ని గమనించారు. నార్వే ప్రజలు స్వల్ప స్థాయిలో వాసనను, ఆకాశంలో స్మోక్ను చూడవచ్చు అని ఎన్ఐఎల్యూ శాస్త్రవేత్త నికోలోస్ ఇవాంజిలియో తెలిపారు. చాలా దూరం నుంచి వస్తున్న ఆ పొగ చాలా స్వల్ప స్థాయిలో ఉంటుందని అన్నారు.
రానున్న కొన్ని రోజుల్లో కెనడా నుంచి వస్తున్న కార్చిచ్చు పొగ యూరోప్ మొత్తంగా వ్యాపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆకాశంలో జరిగే ఆ మార్పును ప్రజలు గమనించలేకపోవచ్చు అని ఇవాంజిలియో తెలిపారు. కెనడా అడవుల్లోంచి రిలీజైన పొగ చాలా ఎత్తు వరకు వెళ్తుందని, దాని వల్ల ఆ పొగ ఎక్కువ దూరం వ్యాపిస్తుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

