Canada Immigration: హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా
Canada Immigration: పది వేల మంది హెచ్-1బీ వీసాదారులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి తెలిపారు. ఆ వీసా ఉన్న ఫ్యామిలీకి కూడా అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వర్క్ పర్మిట్ మూడేళ్ల పాటు ఉండనున్నది.
ఒట్టావో: కెనడా ఇమ్మిగ్రేషన్(Canada Immigration) మంత్రి సీన్ ఫ్రేజర్ కీలక ప్రకటన చేశారు. పది వేల మంది హెచ్-1బీ వీసాదారులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వీసాదారులకు చెందిన కుటుంబాలకు కూడా కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసా ఉన్న వారి కుటుంబీకులు కెనడాలో చదువుకునే, ఉద్యోగం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అమెరికాలోని హైటెక్ కంపెనీల్లో వేలాది మంది వర్కర్లు పనిచేస్తన్నారని, వాళ్లు కెనడాలోనూ విధులు నిర్వర్తిస్తుంటారని, అయితే హెచ్-1బీ వీసా ఉన్న వారు తమ దేశానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కెనడా చెప్పింది. కుటుంబసభ్యులతో పాటు ఆ వీసాదారులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపింది. అనుమతి పొందిన ఉద్యోగులు మూడేళ్ల పాటు తమ వద్ద వర్క్ చేసుకోవచ్చు అని కెనడా పేర్కొన్నది. హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు తాత్కాలిక రెసిడెంట్ వీసా పొందవచ్చు అని ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరు అర్హులు అవుతారు, ఎంత మందిని అనుమతిస్తారన్న దానిపై ఇమ్మిగ్రేషన్ మంత్రి క్లారిటీ ఇవ్వలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

