పిడివాదుల మెదడు

మార్పును ఎంతమాత్రం అంగీకరించలేరు
సాక్ష్యాలు చూపించినా.. నమ్మిందే నిజమంటారు
సిద్ధాంతకర్తల భావాలకు కట్టుబడి ప్రవర్తిస్తారు
అతివాదులు, మితవాదుల ప్రవర్తనపై ‘కేంబ్రిడ్జ్ వర్సిటీ’ అధ్యయనం
లండన్, ఫిబ్రవరి 22: మనసుపొరల్లో పాతుకుపోయిన అభిప్రాయాన్ని పిడివాదంతో నెగ్గించుకునే అతివాదుల, మితవాదుల ప్రవర్తనకు గల కారణాలపై ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనాన్ని చేపట్టారు. అతివాద, మితవాద భావాలు గల వ్యక్తులు కండ్లముందు వాస్తవాలు కనిపించినప్పటికీ, తమ అభిప్రాయాల్ని మార్చుకునేందుకు ఇష్టపడరు. దీనికి గల కారణాలు ఏమిటి? వారి జ్ఞాపకశక్తి, మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి? మార్పును కోరుకునే స్వభావం వారిలో లేకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై ప్రధానంగా ఈ అధ్యయనం కొనసాగింది. కొత్త భావనలను స్వీకరించటానికి మానసికంగా సిద్ధంగా ఉండకపోవడం వల్లనే (అన్కాన్షియస్ ప్రాసెసింగ్ ఆఫ్ చేంజింగ్) అతివాదులు, మితవాదులు కొత్త విషయాలను అంత సులువుగా అంగీకరించలేకపోతున్నారని అధ్యయనం తెలిపింది. ఆలోచనాలేమితో తీసుకునే నిర్ణయాలు, జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం కూడా దీనికి మరో కారణంగా వివరించింది. సంప్రదాయ రాజకీయాలకు పూర్తి మద్దతునిస్తూ, కొత్త ఆవిష్కరణలు, మార్పులను అంగీకరించడానికి సిద్ధంగాలేని వారి మానసిక స్థితులను ఈ అధ్యయనంలో విశ్లేషించామని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మనస్తత్వ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ లియోర్ జిమిగ్రోడ్ తెలిపారు. ఈ వివరాలు ‘ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ’ జర్నల్లో ప్రచురితం అయ్యాయి.
సున్నితమైన సమస్యల వల్ల కూడా..
‘మతపరమైన విషయాలు, జాతీయవాదం వంటి అంశాలకు సంబంధించి అతివాద, మితవాద భావాలున్న వారు అతి విశ్వాసంతో ఉంటారు. ఆయా అంశాలకు సంబంధించి ఇలాంటి వారికి సాక్ష్యాలతో కూడిన సమాచారాన్ని చూపించినప్పటికీ వాళ్లు అంగీకరించే పరిస్థితుల్లో ఉండలేరు. వ్యక్తిగత ప్రవర్తన (పర్సనాలిటీ ట్రేయి ట్స్), విచక్షణలేమితో కూడిన జ్ఞానం (అన్కాన్షియస్ కొగ్నిషన్) దీనికి కారణం’ అని అధ్యయనం తెలిపింది. ‘సున్నితమైన సమస్యలు ఇలాంటివారిని తీవ్రమైన సిద్ధాంతాలను పాటించేలా చేస్తాయి. అధికారుల భావజాలానికి విరుద్ధంగా కొన్ని ప్రమాదకర చర్యలకు ఉసిగొల్పుతాయి’ అని జిమిగ్రోడ్ వివరించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు 22-63 ఏండ్లు. వీళ్లందరూ అమెరికాకు చెందినవారే. ఇందులో 49.4 శాతం మంది మహిళలు ఉన్నారు. ‘విమెన్ ఆఫ్ ది ఫ్యూచర్ సైన్స్’ అవార్డును జిమిగ్రోడ్ ఇటీవల అందుకున్నారు.
అధ్యయనం సాగిందిలా..
అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల మానసిక పరిస్థితిని గుర్తించేందుకు
‘హాట్ ఎమోషనల్ కాగ్నిషన్’, ‘కోల్డ్ అన్కాన్షియస్ కాగ్నిషన్’ పద్ధతులను ఉపయోగించారు. ‘హాట్ ఎమోషనల్ కాగ్నిషన్’ పద్ధతిలో వ్యక్తులు భావోద్వేగాలకు లోనవుతారు. దీనికి ప్రభావితమైన వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ‘కోల్డ్ అన్కాన్షియస్ కాగ్నిషన్’ పద్ధతిలో భావోద్వేగాలకు తావు ఉండదు. విశ్లేషణ, లాజిక్ తదితర అంశాలను ఆధారంగా చేసుకొనే నిర్ణయాలు ఉంటాయి. సాక్ష్యాధారాలు ఉంటేనే ఈ తరహా వ్యక్తులు ఒక నిర్ణయానికి వస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

