Diwali | దీపావళికి అధికారిక సెలవు.. రాష్ట్ర ప్రత్యేక దినం గుర్తించిన కాలిఫోర్నియా..!
Diwali | కాలిఫోర్నియాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం లభించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ ఇటీవల ఒక చట్టంపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించారు. ఈ మేరకు చట్టంపై ఆయన సంతకం చేశారు.
Diwali | కాలిఫోర్నియాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం లభించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ ఇటీవల ఒక చట్టంపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించారు. ఈ మేరకు చట్టంపై ఆయన సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం, ఇకపై కాలిఫోర్నియాలో ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి రోజున వేతనంతో సెలవు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ చట్టం ‘అసెంబ్లీ బిల్ 268’ రూపంలో ఆమోదం పొందింది. ఈ నిర్ణయంతో కాలిఫోర్నియాలోని దక్షిణాసియా వాసుల, ముఖ్యంగా ప్రవాస భారతీయుల సంస్కృతికి గౌరవం లభించింది. ఈ చట్టం విద్యాసంస్థలపైన కూడా ప్రభావం చూపించనుంది. కాలిఫోర్నియాలోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి పండుగ గురించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది.
కొంతమంది ఉద్యోగులకు కూడా వేతనంతో సెలవు పొందడానికి వీలు కల్పిస్తుంది. భారతీయ సంతతికి చెందిన అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా, దర్శనా పటేల్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా ప్రవాస భారతీయుల సంస్కృతిక చరిత్రకు మరింత గుర్తింపు లభించిందంటూ సిలికాన్ వ్యాలీ పారిశ్రామికవేత్త అజయ్ భుటోరియా స్వాగతించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళికి అధికారిక గుర్తింపునివ్వడం కాలిఫోర్నియా సమ్మిళిత స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల భారతీయ కుటుంబాలు తమ సంప్రదాయాలను ఆనందంగా, పనిచేయకుండానే జరుపుకునే అవకాశం కలుగుతుందని భుటోరియా పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి దక్షిణ కాలిఫోర్నియా వరకు, భారతీయ సమాజం అమెరికా అభివృద్ధిలో కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న ఈ సందర్భంగా ఈ చట్టం ప్రవాస భారతీయులకి ఇచ్చిన గౌరవం అని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

