బ్రిటన్ ఆర్థిక మంత్రిపై ట్రస్ వేటు
బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వివాదం కావటంతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది.
- పన్నుల కోత వ్యవహారం వల్లే
లండన్, అక్టోబర్ 14: బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వివాదం కావటంతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ప్రధాని సూచనలతోనే తాను చాన్స్‌లర్ పదవి నుంచి తప్పుకొంటున్నానని క్వాసీ తెలిపారు. ఆయన 38 రోజులే ఆ పదవిలో కొనసాగారు. కాగా, ఆయన స్థానంలో క్యాబినెట్ మాజీ మంత్రి జెరేమీ హంట్‌ను నియమిస్తూ ట్రస్ నిర్ణయం తీసుకొన్నారు.
కాగా, బ్రిటిష్ మార్కెట్లు కుదేలవుతున్న నేపథ్యంలో రిషి సునక్‌కు చాన్స్‌లర్ బాధ్యతలు అప్పగించాలని కన్జర్వేటివ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇదిలా ఉండగా, క్వాసీపై వేటుకు పన్నుల కోత వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. పన్ను కోతలపై సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలవుతున్నట్టు చర్చ నడుస్తున్నది. డాలర్‌తో పోల్చితే పౌండ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీన్ని అరికట్టేందుకు ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగిన సమయంలోనే బడ్జెట్లో మార్పులు చేపట్టడమే సమస్యకు దారితీసిందని విశ్లేషకులు చర్చించుకొంటున్నారు. కాగా, పన్ను కోత నిర్ణయాన్ని ట్రస్ వెనక్కి తీసుకొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

