పురుషాంగం చిన్నగా ఉందని ఎగతాళి.. విధుల్లో నుంచి పోలీసు తొలగింపు
ఇంగ్లండ్ : ఓ పోలీసు అధికారి అనుచిత ప్రవర్తన.. అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సహోద్యోగి పురుషాంగం చిన్నగా ఉందని ఎగతాళి చేయడంతో.. ఆ పోలీసు ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ పోలీసు డిపార్ట్మెంట్లో చోటు చేసుకుంది.
పోలీసు ఆఫీసర్ అడమ్ రీడ్స్ 2021లో డివైజెస్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలోనే ఓ కొత్త ఉద్యోగి విధుల్లో చేరాడు. అయితే కొత్త ఉద్యోగి ప్యాంట్‌ను బలవంతంగా విప్పి.. అతని పురుషాంగాన్ని అడమ్ రీడ్స్ పట్టుకున్నాడు. పురుషాంగం చిన్నదిగా ఉందని అందరి ముందే ఎగతాళి చేశాడు.
ఈ ఘటనను పోలీసు డిపార్ట్మెంట్ సీరియస్‌గా తీసుకుంది. కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐదు రోజుల విచారణ అనంతరం అడమ్ రీడ్స్‌ను విధుల్లో నుంచి తొలగిస్తూ తీర్పు వెల్లడైంది. అడమ్ రీడ్స్ వైఖరిపై విల్ట్‌షైర్ డిప్యూటీ చీఫ్ కానిస్టేబుల్ పాల్ మిల్స్ స్పందించారు. అడమ్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సహోద్యోగి గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించాడని పేర్కొన్నారు. రీడ్స్ ప్రవర్తన అవాంఛిత శృంగారానికి ప్రయత్నించినట్లు ఉందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

