లండన్: బ్రిటన్‌లో జన్మించిన కార్లో ఆక్యుటిస్ (15) కేథలిక్ చర్చ్ సెయింట్ కాబోతున్నాడు. 2006లో లుకేమియా వ్యాధితో ఆక్యుటిస్ మరణించాడు. అతి చిన్న వయసు నుంచే అతడు కంప్యూటర్ వాడకంలో పట్టు సంపాదించాడు. ‘గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్’గా అందరికీ సుపరిచితుడయ్యాడు.
1990వ దశకంలో జన్మించినవారికి సెయింట్‌హుడ్ రావడం ఇదే మొదటిసారి. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు ఆక్యుటిస్ వాడిన టీ-షర్టుల్లో ఒకదానిని ముట్టుకోవడంతో, అకస్మాత్తుగా ఆ వ్యాధి నుంచి విముక్తి పొందినట్లు వార్తలు వచ్చాయి.