No Vaccine No Surgery | టీకాకు నో.. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ నుంచి ఔట్!
No Vaccine No Surgery | అమెరికన్ వ్యాక్సినేషన్‌కు నిరాకరణతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ లిస్ట్ నుంచి దవాఖాన ఆ పేరు తొలగించింది.

No Vaccine No Surgery | ఆ వ్యక్తి (31)కి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలి.. కానీ ఆ చికిత్స చేయాలంటే కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు కరోనాతో ఛాతీ, గుండెలు దెబ్బతిని ప్రాణాలు పోతున్నాయి. కానీ గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం దవాఖానలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించాడు. అంతే.. గుండె మార్పిడి శస్త్రచికిత్స జాబితా నుంచి అతడి పేరును తొలగించేశారు ఆ దవాఖాన వైద్యులు. అమెరికాలోని బోస్టన్‌లో గల ఓ దవాఖానలో ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి పేరు డీజే ఫెర్గూసన్..హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేస్తేనే బతుకుతాడు. కానీ బోస్టన్లోని ఆ దవాఖాన యాజమాన్యం వ్యాక్సిన్ చేయించుకోని వారికి ఎటువంటి శస్త్రచికిత్సలు చేయరాదని నిర్ణయం తీసుకున్నది. ఇదే విషయాన్ని డీజీ ఫెర్గూసన్‌కు దవాఖాన వైద్యులు తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఫెర్గూసన్ నిరాకరించారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఫెర్గూసన్ మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.
యాంటీ వ్యాక్సర్ల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఫెర్గూసన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవేళ వ్యాక్సినేషన్ తప్పనిసరి కాని దవాఖానకు తరలించడానికి ప్రయత్నిస్తే ఫెర్గూసన్ బలహీన పడతాడేమోనని ఆందోళన చెందుతున్నారు. అన్ని రకాల ఆప్షన్లను తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమెరికా వ్యాధుల నియంత్రణ, నిరోధక కేంద్రం సిఫారసు ప్రకారం కరోనా వైరస్ ప్రభావం బారిన పడకుండా శస్త్ర చికిత్స చేయించుకునే వారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. అనిశ్చితి మధ్య ఇప్పటికీ ఫెర్గూసన్ తన ప్రాణాలను కాపాడేందుకు హృదయం ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

