లా పాజ్: విప్లవ వీరుడు చెగువేరాను (Che Guevara) కాల్చి చంపిన బొలీవియా మాజీ సైనికుడు మారియో టెరాన్ సలాజర్ మృతిచెందాడు. వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న టెరాన్ తన 80 ఏండ్ల వయస్సులో సియెర్రాలోని విలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బొలీవియా సైన్యంలో పనిచేసిన టెరాన్ 1967, అక్టోబర్ 9న చెగువేరాను కాల్చిచంపాడు.
1967, అక్టోబర్ 8న ఇద్దరు క్యూబా-అమెరికన్ సీఐఏ ఏజెంట్ల సహాయంతో బొలీవియన్ సైన్యం మార్క్సిస్ట్ విప్లవ వీరుడు ఎర్నెస్టో చేగువేరాను బంధించింది. గువేరాను పట్టుకున్న సైనికుల్లో టెరాన్ కూడా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చెగువారాను లా హిగువేరా అనే గ్రామంలో ఉన్న ఓ పాఠశాలలో ఉంచారు. మరుసటి రోజు అంటే అక్టోబర్ 9న అప్పటి బొలీవియా అధ్యక్షుడు రెనే బారియంటోస్ (1964-69) ఆమోదంతో చెగువేరాను.. టెరాన్ కాల్చిచంపాడు.