Watch: అమెరికాను వణికించిన మంచు తుపాను.. బయట ఉన్న వస్తువులన్నీ మంచు కింద మాయం
రెండు రోజులుగా మంచు తుపాన్ కురిసింది. దీంతో ఆరు బయట ఉన్న వస్తువులన్నీ క్రమంగా దట్టంగా పరుచుకున్న మంచు కింద కనిపించకుండా పోయాయి.
వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికించింది. దట్టంగా పరుచుకున్న మంచు వల్ల బయట ఉన్న వస్తువులన్నీ మాయమయ్యాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోష్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని పలు నగరాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మెక్సికో సరిహద్దులోని టెక్సాస్తో సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. పలు చోట్ల విద్యుత్ లేక గడ్డ కట్టే చలిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గత రెండు రోజులుగా భారీగా మంచు తుపాన్ కురిసింది. దీంతో ఆరు బయట ఉన్న వస్తువులన్నీ క్రమంగా దట్టంగా పరుచుకున్న మంచు కింద కనిపించకుండా పోయాయి. ఒక చోట ఉన్న ప్లాస్టిక్ కుర్చీ, చిన్న విగ్రహం, ఒక పోల్, కార్లు, అక్కడి రోడ్లు వంటి వాటిపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో సుమారు 48 గంటల్లో అవన్నీ మంచు వల్ల మాయమయ్యాయి.
కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 30 లక్షల మంది ఈ వీడియోను చూశారు. పలువురు నెటిజన్లు చాలా విస్మయం చెందారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ మేర పెరుగవచ్చని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారీగా పేరుకున్న మంచు కరుగడం వల్ల స్వల్ప స్థాయిలో వరదలు రావచ్చని హెచ్చరించింది.
https://twitter.com/weirdterrifying/status/1608446170334101504?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1608446170334101504%7Ctwgr%5E6d2efcf3f94593be44b9fb4338abab3c9c239536%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Ffeature%2Fstunning-time-lapse-video-captures-48-hours-of-blizzard-impact-in-us-town-3651163
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

