వాషింగ్టన్: మీకు రోజూ బ్లాక్‌టీ తాగే అలవాటు ఉన్నదా! అయితే మంచిదే అంటున్నారు పరిశోధకులు. రోజూ బ్లాక్ టీ తాగేవారు వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. చిన్ననాటినుంచి రోజూ కప్పు బ్లాక్ టీ తాగిన 881 మంది 80ఏండ్ల వయస్సుగల మహిళలపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదకర ఉదర బృహద్ధమని గట్టిపడడం కనిపించలేదు.