నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికల్(ఏటీవీ)ని 18వీల్స్ ఐఎన్సీ అనే ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. ‘ఫ్లయింగ్ ఐబ్రో’ గా పిలుస్తున్న ఈ 18 చక్రాల వాహనం తాజా వెర్షన్ను అక్టోబర్లో విడుదల చేయనున్నారు.
బ్యాటరీతో నడిచే ఈ వాహనం మెట్ల పైనా, నేలకూలిన చెట్లపైనా కూడా ప్రయాణించగలదని తయారీదారులు వెల్లడించారు.