flying EYEBROW| నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ ఏటీవీ.. అభివృద్ధి చేసిన ఫిన్లాండ్ కంపెనీ
నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ)ని ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. 18 చక్రాలు ఉండే ఈ ఏటీవీకి ‘ఫ్లయింగ్ ఐబ్రో’ అని పేరుపెట్టారు.
flying EYEBROW| హెల్సింకి: నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ)ని ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. 18 చక్రాలు ఉండే ఈ ఏటీవీకి ‘ఫ్లయింగ్ ఐబ్రో’ అని పేరుపెట్టారు. ఇది అన్ని రకాల ప్రదేశాల్లోనూ దూసుకుపోగలదని కంపెనీ వెల్లడించింది. గత ఏడాదే ఈ ఏటీవీ ప్రొటోటైప్‌ని విడుదల చేసినప్పటికీ.. అక్టోబర్‌లో దీని లేటెస్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. బ్యాటరీతో నడిచే ఈ ఏటీవీ పర్యావరణ హితం కూడా. ఇందులో ఇన్నొవేటివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నది. 18 వీల్స్‌లో ప్రతిదాంట్లోనూ విడిగా ఎలక్ట్రిక్ మోటార్లు బిగించారు.
45 సెంటీమీటర్ల ఎత్తు ఉండే రాళ్లపైనా, పడిపోయిన చెట్లపైనా తమ ఏటీవీ ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ‘మెట్లపైన కూడా మా వెహికిల్ దూసుకుపోగలదు. భూమిపై మరే వాహనానికి ఇది సాధ్యం కాదు’ అని పేర్కొన్నది. నేలపై తమ వాహనం తక్కువ ప్రెజర్నే కలుగజేస్తుందని, కాబట్టి మట్టి, గడ్డి, పచ్చికకుగానీ ఎలాంటి నష్టం జరుగదని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ATV
- flying EYEBROW
- mud
- rocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

