బిల్‌గేట్స్ విడాకులు!

- కలిసి ఉంటే ఎదగలేమని భావిస్తున్నాం
- విడిపోతున్నామని ప్రకటించిన బిల్, మెలిండా గేట్స్
న్యూయార్క్, మే 4: మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్, ఆయన భార్య మెలిండా విడాకులు తీసుకోనున్నారు. తమ 27 ఏండ్ల వివాహబంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. ‘ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి కొనసాగితే జీవితపు తరువాతి దశల్లో ఎదగలేమని భావించాం. ఎంతో ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చాం. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. అయితే మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను కలిసే నిర్వహిస్తామని తెలిపారు. కరోనా కట్టడికి, పేద దేశాలకు టీకాల కోసం మెలిండా గేట్స్ ఫౌండేషన్ గతేడాది రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది.
సేవాకార్యక్రమాలతో విశేష ఖ్యాతి
బిల్‌గేట్స్, మెలిండా విడాకుల ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బిల్‌గేట్స్‌కు 65 ఏండ్లు. మెలిండాకు 56 ఏండ్లు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో మెలిండా ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఇద్దరూ 1994లో పెండ్లి చేసుకొన్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2000 సంవత్సరంలో మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ఆస్తులు 3 లక్షల కోట్లకు పైనే (43 బిలియన్ డాలర్లకు) పైనే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

