Bill Gates Divorce: గేట్స్ విడాకులకు జడ్జి ఆమోదం

న్యూయార్క్: బిల్ గేట్స్ ( Bill Gates ).. మెలిండా గేట్స్ ( Melinda Gates ) 27 ఏళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా బ్రేక్ పడింది. మెలిండా దరఖాస్తు చేసుకున్న విడాకులకు ( Divorce ) జడ్జి ఆమోదం తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు సింగిల్ అయిపోయారు. తాము విడిపోతున్నట్లు గేట్స్ దంపతులు మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మెలిండా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.
కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్టు ఆధారంగా డైవర్స్ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఎవరు భరణం ఇచ్చే రీతిలో ఒప్పందం జరగలేదని కోర్టు డాక్యుమెంట్ల ద్వారా స్పష్టం అవుతున్నది. విడాకుల ఆమోద పత్రంలో ఆర్థిక అంశాల గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. తాజా సమాచారం ప్రకారం.. బిల్ గేట్స్ ఆస్థి సుమారు 152 బిలియన్ల డాలర్లు. అయితే డైవర్స్ తర్వాత ఆ ఆస్తి ఒకవేళ ఇద్దరికీ సమంగా పంపిణీ చేస్తే, అప్పుడు ఒక్కొక్కరి ఆస్థి సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు.
50 బిలియన్ డాలర్ల గేట్స్ ఫౌండేషన్‌ను మాత్రం ఇద్దరూ కలిసి మరో రెండేళ్ల పాటు సంయుక్తంగా నడపనున్నట్లు కోర్టు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. మెలిండా ఫ్రెంచ్ గేట్స్ విడాకులు కోసం వాషింగ్టన్ కౌంటీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. బిల్ గేట్స్ వయసు 65 ఏళ్లు. మెలిండా వయసు 56 ఏళ్లు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

