బార్లో కాల్పుల కలకలం : 9 మంది మృతి
సెంట్రల్ మెక్సికో గునజుటో స్టేట్‌లోని ఓ బార్లో కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి గాయాలయ్యాయి.
మెక్సికో : సెంట్రల్ మెక్సికో గునజుటో స్టేట్‌లోని ఓ బార్లో కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి గాయాలయ్యాయి. అపసియోల్ అల్టో పట్టణంలోని బార్లోకి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చొచ్చుకువచ్చిన సాయుధ దుండగులు లోపలున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు.
కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళల పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన దుండగులను ఇంకా గుర్తించలేదని, ఓ నేరస్తుల గ్రూపునకు సంబంధించిన రెండు పోస్టర్లు ఘటనా స్ధలంలో విడిచివెళ్లారని చెప్పారు.
పారిశ్రామిక హబ్‌గా పేరొందిన గునజుటోలో తరచూ గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. గత నెలలో ఇరుపుటో సిటీలోని బార్లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించగా సెప్టెంబర్‌లో అదే ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

