Canada | టొరంటో, జనవరి 5: కెనడాలో విదేశీయులు ఇండ్లు కొనడంపై విధించిన నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం పొడిగించింది. కెనడియన్లు సొంత నివాసాలు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు తలెత్తున్న క్రమంలో విదేశీ ఉద్యోగులు, విద్యార్థులు ఇండ్లు కొనడంపై నిషేధాన్ని మరో రెండేండ్ల వరకు పొడిగించారు. ప్రస్తుతం 2025 జనవరి 1 వరకు ఉన్న నిషేధాన్ని 2027 జనవరి 1 వరకు పొడిగించారు. ఈ మేరకు కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ ఓ ప్రకటన విడుదల చేశారు.