గుబులు పుట్టిస్తున్న ఆ శబ్ధాలు.. ఆ ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే
Earths Magnetic Field sounds: : ఈ శబ్ధాలు విన్నారా. వళ్లు వణికిపోవాల్సిందే. భయపెట్టే ఆ శబ్ధాలకు చెందిన ఓ ఆడియోను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా రిలీజ్ చేసింది. 5 నిమిషాలు ఉన్న ఆ ఆడియో.. భూ అయస్కాంత క్షేత్రంలోని ధ్వని తరం
కోపెన్హెగన్: ఈ శబ్ధాలు విన్నారా? వళ్లు వణికిపోవాల్సిందే ! భయపెట్టే ఆ శబ్ధాలకు చెందిన ఓ ఆడియోను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా రిలీజ్ చేసింది. 5 నిమిషాలు ఉన్న ఆ ఆడియో.. భూ అయస్కాంత క్షేత్రంలోని ధ్వని తరంగాలను వినిపిస్తోంది. భూ అయస్కాంత క్షేత్రంలోని తరంగాలు ధ్వనిగా మారితే ఎలా ఉంటుందో ఆ ఆడియోలో తెలుసుకోవచ్చు. భూగర్భంలోని మాగ్నెటోస్పియర్ నుంచి వస్తున్న ఆ తరంగాలు ఒక రకంగా ఈ భూగోళాన్ని సూర్యుడి రేడియేషన్ నుంచి రక్షిస్తున్నాయి.
టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు మ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను స్టడీ చేశారు. స్వార్మ్ శాటిలైట్ మిషన్ ద్వారా ఆ అయస్కాంత తరంగాలను పరిశీలిస్తున్నారు. అయస్కాంత క్షేత్రం నుంచి రిలీజ్ అవుతున్న తరంగాలను ధ్వనిగా మారుస్తోంది స్వార్మ్ శాటిలైట్.
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ రిలీజ్ చేసిన ఆడియోలోని శబ్ధాలు వింటే ఓ వింత అనుభూతికి లోనవుతాం. పగుళ్ల నుంచి శబ్ధం వస్తున్నట్లుగా ఆ ధ్వనులు ఉన్నాయి. లోతుగా శ్వాసను తీసుకుంటున్న సమయంలో వచ్చే శబ్ధాల తరహాలో భూ అయస్కాంత క్షేత్రం నుంచి ధ్వనులు వస్తున్నట్లు చెప్పారు.
డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న సోల్బెర్గ్ స్క్వేర్‌లోని లౌడ్ స్పీకర్లతో అక్టోబర్ 24వ తేదీన ఆ ధ్వనులను మూడుసార్లు రికార్డు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

