పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా… ‘ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకనే అతడిని చంపాలనుకున్నా. ఇమ్రాన్ ఒక్కడిని మాత్రమే హత్య చేయాలన్నది నా ఉద్దేశం. ఇమ్రాన్ చేపట్టిన ‘నిజమైన స్వాతంత్రం’ యాత్ర లాహోర్ సిటీ దాటగానే అతడిని చంపాలని నిర్ణయం తీసుకున్నా. ఇక్కడికి నేను ఒక్కడినే బండి మీద వచ్చాను. నా వెనక ఎవరూ లేరు ‘ అని నిందితుడు వీడియోలో చెప్పాడు. ఇమ్రాన్ని చంపాలనేది తన ఒక్కడి నిర్ణయమే అని, తన వెనక ఎవరూ లేరని చెప్పాడు.