Red Pins: ఆస్కార్ వేడుకలో రెడ్ పిన్స్ ధరించిన నటులు.. ఎందుకోసమంటే
Red Pins: ఆస్కార్ వేడుకకు వచ్చిన నటులు చిన్న సైజు రెడ్ పిన్స్ ధరించారు. చేతికి చెందిన బొమ్మపై ఉన్న అరచేతిలో ఓ నల్ల రంగు గుండెను ఆ పిన్‌లో డిజైన్ వేశారు. గాజాలో శాంతి డిమాండ్ చేస్తూ ఆ పిన్స్ పెట్టుకున్నట్లు నటుడు రామీ యూసెఫ్ తెలిపారు.
లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో.. కొందరు నటులు చిన్న సైజు రెడ్ పిన్స్(Red Pins) ధరించారు. చేతికి చెందిన బొమ్మపై ఉన్న అరచేతిలో ఓ నల్ల రంగు గుండెను వేశారు. రెడ్ పిన్స్ ధరించిన నటుల ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇజ్రాయిల్ – హమాస్ సంక్షోభానికి తెరదించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని కోరుతూ ఆ పిన్స్‌ను ధరించినట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి డిమాండ్ చేస్తూ ఆ పిన్స్ పెట్టుకున్నట్లు నటుడు రామీ యూసెఫ్ తెలిపారు. గాజాలో శాశ్వతంగా, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని పిలుపు ఇస్తున్నామని, పాలస్తీనా ప్రజలకు కూడా శాంతి దక్కాలని, పిల్లల్ని చంపడం ఆపేయండని నటుడు యూసెఫ్ తెలిపారు.
ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ ఆ రెడ్ పిన్నులను అందించింది. గాజాలో శాంతి నెలకొల్పాలని కోరుతూ నటులు ఓ లేఖపై సంతకం చేసి అధ్యక్షుడు బైడెన్‌కు పంపారు. సంతకం చేసిన నటుల్లో జెస్సికా చాస్టియన్, క్వింటా బ్రున్సన్, రిచర్డ్ గేర్, అమెరికా ఫెరిరా, కేట్ బ్లాంకెట్, లుపిటా నుంగో, మెహర్షాలా అలీ ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

