Ukraine | ఉక్రెయిన్ ఆకాశంలో యూఎఫ్‌వోలు గుర్తించామంటున్న ఆస్ట్రోనాట్లు!
Ukraine | రష్యాతో ఏడు నెలలుగా యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ ఆకాశంలో యూఎఫ్‌వోలు కనిపించాయట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కొందరు ఆస్ట్రోనాట్లు వెల్లడించారు. వీటిని కీవ్‌లో ఉల్కల అబ్జర్వేటరీలోనూ,
రష్యాతో ఏడు నెలలుగా యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ ఆకాశంలో యూఎఫ్‌వోలు కనిపించాయట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కొందరు ఆస్ట్రోనాట్లు వెల్లడించారు. వీటిని కీవ్‌లో ఉల్కల అబ్జర్వేటరీలోనూ, అలాగే వినారివ్కాలోని మరో అబ్జర్వేటరీలోనూ గమనించినట్లు సదరు ఆస్ట్రోనాట్లు తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన మెయిన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో కథనాలు ప్రచురితమయ్యాయి.
కీవ్ ఆకాశంలో చాలా చోట్ల ఈ యూఎఫ్‌వోలు కనిపించాయని, కొన్నిసార్లు ఇవి గుంపులుగా కూడా వెళ్తూ కనిపించాయని ఆస్ట్రోనాట్లు చెప్తున్నారు. అయితే వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమెరికా పరిశోధకులు అంటున్నారు. అయితే ఉక్రెయిన్ వ్యోమగాములు మాత్రం.. ఈ యూఎఫ్వోలను రెండు రకాలుగా విభజించారు. ఒక రకం యూఎఫ్‌వోలు చాలా కాంతివంతంగా కనిపిస్తుంటే, మరొక రకానికి చెందినవి తమ చుట్టూ ఉన్న కాంతిని పూర్తిగా శోషించుకుంటున్నాయని ఉక్రెయిన్ పరిశోధకులు అంటున్నారు.
వీటిని సాధారణంగా చూడలేమని, శక్తిమంతమైన కెమెరాలో ఎన్నో సెట్టింగులు మార్చుకుంటేనే కనిపిస్తున్నాయని వివరించారు. అయితే ఈ పరిశోధకులు తమ అధ్యయనంలో ఎక్కడా రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అదే సమయంలో అమెరికా పరిశోధకులు ఈ యుద్ధాన్ని కారణంగా చూపి, దీనిలో ఉపయోగించే డ్రోన్స్ వల్ల కూడా ఇలా కనిపించి ఉండొచ్చని అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Telugu News
- UFO
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

