Vladimir Putin | పుతిన్‌కు భంగపాటు.. ప్రసంగిస్తుండగా ఐరోపా ప్రతినిధులు వాకౌట్
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కు భంగపాటు ఎదురైంది. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన జరిగింది.
బీజింగ్: రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కు భంగపాటు ఎదురైంది. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన జరిగింది. అతిపెద్ద దౌత్య కార్యక్రమాన్ని చైనా నిర్వహించింది. బెల్ట్, రోడ్ (BRI) ప్రాజెక్ట్, బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధ్యక్షతన బుధవారం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో జరిగిన చైనా సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.
కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి బయటకు రాని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది తొలిసారి చైనాను సందర్శించారు. అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించిన బ్రిఫ్ కేస్‌ను తన వెంట తీసుకెళ్లిన ఆయన చైనా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు బుధవారం సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. అయితే ఆయన మాట్లాడటం మొదలుపెట్టగానే యూరోపియన్ ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు నిరసనగా శిఖరాగ్ర సమావేశం హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

