టెక్సాస్: ఆర్టెమిస్-2(Artemis II) వ్యోమగాములు .. చంద్రుడి ఉపరితలంపై అనూహ్యమైన రంగులను గుర్తించారు. చంద్రుడిని చుట్టువచ్చే క్రమంలో .. చల్లటి జాబిలిపై మల్టీఫుల్ కలర్స్ ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చందమామ సమీపం నుంచి బ్రౌన్ రంగులో కనిపించినట్లు చెప్పారు. ఇక అక్కడక్కడ మూన్‌పై గ్రీన్ కలర్ ఛాయలు కూడా కనిపించినట్లు తెలిపారు. కానీ చాలా వరకు చంద్రుడి ఉపరితలం మొత్తం బ్రౌన్ రంగులోనే ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రీన్ వర్ణంలో వెన్నెలరాజు దర్శనమిచ్చినట్లు వెల్లడించారు. చంద్రుడిని ఎంత తీక్షణంగా చూస్తే, ఆ ఉపరితలం అంత బ్రౌన్ రంగులో మెరిసినట్లుగా ఉందని మిషన్ స్పెషలిస్టు క్రిస్టినా కౌచ్ తెలిపారు. నాసా ట్రాన్స్‌మిషన్‌తో మాట్లాడుతూ.. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ఆమె అన్నారు. ఇక కెనడా ఆస్ట్రోనాట్ జెర్మీ హన్సెన్ మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరిస్టార్చస్ పీఠభూమి వద్ద చంద్రుడి వర్ణం గ్రీన్‌గా ఉందని అన్నారు. చంద్రుడిలోని ఆ చీలక చాలా కొత్తదని, ఇక్కడ ఉన్న కలరేషన్ చాలా విశిష్టంగా ఉన్నట్లు ఆ ఆస్ట్రోనాట్ పేర్కొన్నారు. మూన్‌పై మరోచోట ఇలాంటి రంగు కనిపించలేదన్నారు.
చంద్రుడిని చుట్టి వచ్చే క్రమంలో.. భూమి నుంచి దూరంగా ఆర్టెమిస్-2 వ్యోమనౌక వెళ్లినట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మాన్ పేర్కొన్నారు. భూమి నుంచి సుమారు 2 లక్షల 50 వేల మైళ్ల దూరం ఆర్టెమిస్ ప్రయాణించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆర్టెమిస్‌లో ఉన్న నలుగురు ఆస్ట్రోనాట్లు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మీ హన్సెస్ భూమికి సుమారు 2,52,756 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా మనుషులు ఇంత దూరం ప్రయాణించలేదన్నారు. ఆర్టెమిస్-2లో పాల్గొన్న సిబ్బందికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు.
ఆర్టెమిస్‌లో ప్రయాణించిన వ్యోమగాములను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వారితో ఆయన మాట్లాడారు. మీరు చరిత్ర సృష్టించినట్లు చెప్పారు. అమెరికన్లు అందరూ గర్వపడేలా చేశారన్నారు. ఎంతో గర్వంగా ఉందని కూడా ట్రంప్ ఆ టీమ్‌తో పేర్కొన్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లు చాలా ధైర్యవంతులు అని ప్రశసించారు. ఆధునిక కాలానికి చెందిన మార్గదర్శకులని అన్నారు. అంతరిక్ష రంగంలో అమెరికా అద్భుతాలు సాధించిందని, ఇక నక్షత్రాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
🚀 LIVE FROM SPACE: President Donald J. Trump Calls Artemis II Astronauts After Breaking the Farthest Distance Record in Human Spaceflight 🇺🇸 HISTORIC!
“Your mission paves the way for America’s return to the lunar surface very soon.” pic.twitter.com/1TzmIEQG0l
— The White House (@WhiteHouse) April 7, 2026