మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్
Anwar Ibrahim:మలేషియా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఆ దేశ ప్రధాని అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్రధానిని నియమించారు. అన్వర్ లేదా మాజీ ప్రధాని యాసిన్ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రభుత్వ
కౌలాలంపూర్: మలేషియా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఆ దేశ ప్రధాని అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్రధానిని నియమించారు. అన్వర్ లేదా మాజీ ప్రధాని యాసిన్ ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్వల్ప మెజారిటీ కూడా సాధించలేకపోయారు. చక్రవర్తి సుల్తాన్ సమక్షంలో మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మలేషియాకు అన్వర్ పదవ ప్రధాని కానున్నారు.
అన్వర్‌కు చెందిన పకాటన్ హర్పన్ (పీహెచ్) పార్టీ శనివారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లను ఆ పార్టీ గెలవలేకపోయింది. అయితే ఏ పార్టీలు కూటమిగా మారుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అయిదు రోజుల పాటు చర్చలు జరిగినా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం వెలుబడలేదు.
1990 దశకంలో మలేషియా డిప్యూటీ ప్రధానిగా అన్వర్ చేశారు. అప్పట్లో మాజీ ప్రధాని మహతిర్ స్థానంలో అన్వర్ వస్తారని ఆశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

