Carpenter Ants | చీమలు కూడా సర్జన్లే.. గాయపడిన తోటి చీమకు వైద్యసాయం
చీమలు కష్ట జీవులని తెలుసు. అయితే, గాయాలపాలైన వారికి మనుషుల్లా సాయం చేయడమే కాదు గాయాలను మాన్పించే డాక్టర్లుగా, సర్జన్లుగానూ చీమలు పనిచేస్తాయని తెలుసా? ఇది నిజం.
- మనిషి తర్వాత రెండో సర్జన్‌గా గుర్తింపు
- జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Carpenter Ants | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): చీమలు కష్ట జీవులని తెలుసు. అయితే, గాయాలపాలైన వారికి మనుషుల్లా సాయం చేయడమే కాదు గాయాలను మాన్పించే డాక్టర్లుగా, సర్జన్లుగానూ చీమలు పనిచేస్తాయని తెలుసా? ఇది నిజం. గాయాలపాలైన చీమను రక్షించడానికి తోటి చీమలు డాక్టర్లుగా మారి వైద్యసాయం అందిస్తాయని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్‌బర్గ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలో తేలింది. మందులు, వైద్య పరికరాల అవసరం లేకుండానే శస్త్రచికిత్సలను చేసి చీమలు సర్జన్లుగానూ మారుతాయని వెల్లడైంది.
పరిశోధన ఇలా..
ఏదైనా చీమ గాయపడితే.. తోటి చీమలు వెంటనే ఆ గాయపడిన చీమ చుట్టూ చేరుకొని దాన్ని పుట్టలోకి తీసుకెళ్తాయని ఇదివరకు జరిగిన పరిశోధనల్లో తేలింది. అయితే, పుట్టలో ఆ తోటి చీమలు ఏంచేస్తాయన్న విషయంపై మైక్రో కెమెరాల సాయంతో యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్‌బర్గ్ శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేశారు. దీనికోసం ఓ ఫ్లోరిడా కార్పెంటర్ చీమ కుడి తొడ కిందిభాగంలో ఉద్దేశపూర్వకంగా కోత పెట్టారు. ఇది జరగ్గానే, ఆ గాయపడిన చీమ చుట్టూ దాదాపు 13-17 చీమలు చేరుకొన్నాయి.
ఆ తర్వాత ఆ గాయపడిన చీమను దగ్గర్లోని పుట్టలోకి తీసుకెళ్లాయి. రక్తస్రావం కాకుండా నోటిలోని లాలాజలంతో ఆ గాయాన్ని అదే పనిగా తడమడం చేశాయి. ఆ తర్వాత, గాయం ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించి తొడ కిందిభాగాన్ని శరీరం నుంచి వేరు చేశాయి. దీనికోసం గాయపడ్డ చీమ తొడను తోటి చీమలు అదే పనిగా కొరికినట్టు పరిశోధకులు తెలిపారు. శరీరం నుంచి ఆ భాగం వేరుపడగానే, మళ్లీ లాలాజలం సాయంతో రక్తస్రావాన్ని నివారించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియనంతా కేవలం 40 నిమిషాల్లోనే పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాసేపటి తర్వాత ఆ గాయపడిన చీమ సాధారణ స్థితికి చేరుకొన్నదని, దానికి ప్రాణాపాయం తప్పిందని వివరించారు. ఈ వివరాలు ‘కరెంట్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఆ రికార్డు చీమకే!
భూమిమీద మనిషి తర్వాత సర్జరీ చేసే రెండో జీవిగా చీమను గుర్తిస్తున్నట్టు పరిశోధనలకు నేతృత్వంవహించిన శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాంక్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

