నా భార్యకు టీకా ఇస్తావా.. నర్సు మొహం పగలగొట్టిన భర్త
నర్సు | కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే మార్గం. ప్రభుత్వాలు కూడా ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నాయి.

క్యూబెక్: కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే మార్గం. ప్రభుత్వాలు కూడా ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నాయి. అందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేస్తున్నాయి. ఓ మహిళ కరోనా టీకా తీసుకున్నది. అయితే తన అనుమతి లేకుండా టీకా తీసుకుంటావా అని ఆమె భర్త గొడవకు దిగాడు. ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు మొహాన్ని పచ్చడి చేశాడు. ఈ ఘటన కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో జరిగింది.
క్యూబెక్ ప్రావిన్స్‌లోని షేర్బ్రూక్ పట్టణంలో ఉన్న ఫార్మసీలో ఓ మహిళ వ్యాక్సిన్ తీసుకున్నది. అనుమతిలేకుండా తన భార్యకు వ్యాక్సిన్ ఇస్తావా అని.. ఆమెకు టీకా ఇచ్చిన నర్సుపై దాడికి దిగాడు. ఆవేశంలో ఆమె మొహంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Canada
- Consent
- Nurse
- Vaccination
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

