మనిషికి పంది గుండె

అమెరికా వైద్యుల ఘనత
బాల్టిమోర్ (యూఎస్): వైద్య రంగంలో మరో మైలురాయి నమోదైంది. మనిషికి పంది గుండెను అమర్చడంలో అమెరికా వైద్యులు విజయం సాధించారు. వైద్యచరిత్రలో ఇలా ఒక జంతువు గుండెను మనిషికి పెట్టడం ఇదే మొదటిసారి. డేవిడ్ బెనెట్ (57) అనే రోగిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా పంది గుండెను అమర్చినట్టు మేరీల్యాండ్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకున్నాడని పేర్కొన్నారు. తనకు మనిషి గుండెను అమర్చే అవకాశం లేదని, ఇక చావు తప్పదనుకున్న తరుణంలో వైద్యులు పంది గుండెను తనకు పెట్టారని రోగి బెనెట్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయం సాధించిందీ, లేనిదీ అప్పుడే చెప్పలేమని తెలిపారు. అవయవ మార్పిడులు జరిపే ముందు ఒకరోజుపాటు తాత్కాలికంగా ఏదైనా జంతువు గుండెను అమర్చే విషయమై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ జంతు -మనిషి అవయవ మార్పిడులకు జన్యుపరమైన మార్పులు చేసిన జంతువుల శరీర భాగాలనే వినియోగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

